telugu navyamedia
ఆంధ్ర వార్తలు

చంద్ర‌బాబుపై నోరు జారిన స‌జ్జ‌ల- మండిప‌డుతున్న తెలుగు త‌మ్ముళ్లు

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెదేపా అధినేత చంద్ర‌బాబు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘రాజధాని నగరం కోసం చేపట్టిన రింగురోడ్డు నిర్మాణాన్ని నిలుపుదల చేశామంటూ ఈ మధ్య కొత్త వివాదాన్ని చంద్రబాబు సృష్టిస్తున్నారు.

ఎప్పుడో వైఎస్‌ హయాంలో ఆమోదించిన కృష్ణానదిపై వంతెనను చంద్రబాబు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. కృష్ణా నదిపై గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ వరకూ వంతెన వేసి, గన్నవరం నుంచి కాజ వరకూ ఆ రహదారిని కలిపితే చంద్రబాబు అనుకున్న అమరావతి అభివృద్ధి జరిగేదన్నారు.

ఎక్కడో 50కి.మీ. దూరంలో ఔటర్‌ రింగ్‌రోడ్డును ఆపేశామంటున్నారు. దానికోసం రూ.17వేల కోట్లు నీ అక్క ..ఎక్కడనుంచి తెచ్చిపెడతారు?’’ అంటూ చంద్రబాబును ఉద్దేశించి సజ్జల బూతులు మాట్లాడారు

ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర ఏపీ రాజ‌కీయాల్లో దుమారం రేపుతున్నాయి. సజ్జల వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

చంద్రబాబుపై నోరు పారుసుకుంటే చూస్తూ ఊరుకునేది లేద‌ని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత హెచ్చ‌రించారు. అమ్మలక్కల గురించి మాట్లాడితే నాలుక తెగ్గోస్తామంటూ హెచ్చరించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు.

Anitha announces TDP women parliament committees, criticises YSRCP

వైఎస్సార్‌సీపీ నేతలకు పిచ్చి పీక్స్‌కు వెళ్తోందన్నారు. ఆ పార్టీ వైఎస్ఆర్ బూతుల పార్టీ అని పేరు పెట్టుకోవాలన్నారు. ‘కనీసం బూతులు మాట్లాడేవారైనా మీ పార్టీవైపు ఉండి మీకు సపోర్టు చేస్తారు. వైసీపీ నాయకులు పేటీయం కుక్కలు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

హైదరబాద్ అభివృద్ధి చెందిందంటే చంద్రబాబు వల్లేనని కేసీఆర్ సైతం చెప్పారన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏ ఐఏఎస్, ఐపీఎస్ రిటైర్డ్ ఆఫీసరనుకున్నాని.. సాక్షి పేపర్ లో ఒక ఉద్యోగని మొన్ననే తెలిసిందన్నారు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నాలుగున్నర లక్షల జీతమిచ్చి ప్రభుత్వ సలహాదారుడిగా పెడితే ‘మీ అమ్మ, నీ అక్క’ అని కాకుండా మంచి పదాలు, ప్రవచనాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఒకవేళ అలాంటి పదాలు వస్తాయని తాము అనుకోవటంలేదన్నారు.

ఇళ్లలో ఆడవారి గురించి అమ్మ నా బూతులు తిట్టించడానికే సజ్జలను, నానీని పెట్టుకున్నట్లున్నారని సెటైర్లు పేల్చారు. ఈ సారి ఆడ‌వారి గురించి వైఎస్సార్‌సీపీ నేత‌లు మాట్లాడితే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని  హెచ్చ‌రించారు.

Related posts