telugu navyamedia
తెలంగాణ వార్తలు

సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి రాజీనామా..

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కు సమర్పించినట్లు తెలుస్తోంది. పి వెంకట్రామిరెడ్డి వీఆర్‌ఎస్‌ ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆయన త్వరలోనే టీఆర్ఎస్ పార్టీ చేరే అవకాశం ఉంది. తాజాగా స్థానిక సంస్థల కోటాలో కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా కలెక్టర్ వెంకట్రామి రెడ్డి పేరును తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఖరారు చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కలెక్టర్‌ పదవికి వెంకట్రామిరెడ్డి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

రాజీనామా ఆమోదం తర్వాత వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజల కోసం ఎంతో కృషి చేస్తోందని, అభివృద్ధి వైపు దూసుకెళ్తోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​  అభివృద్ధి పనుల్లో లో కూడా భాగస్వామ్యం కావాలని రాజీనామా నిర్ణయం తీసుకున్నానని అన్నారు. సీఎం కేసీఆర్‌ నుంచి పిలుపు వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతానని అన్నారు. కేసీఆర్ మార్గనిర్దేశం ప్రకారం పనిచేస్తానని తెలిపారు.

ఇదిలా ఉండగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ రేపటితో ముగియనుండటంతో.. అభ్యర్థుల ఎంపిక కోసం టీఆర్ఎస్ తీవ్ర కసరత్తు చేస్తోంది.

 

Related posts