telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ ఇంగ్లాండ్ ఆటగాళ్లకు బాగా ఉపయోగపడుతుంది : సోక్ట్స్

ఈ ఏడాది భారత్ లోనే జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇంగ్లండ్ జట్టుకు మేలు చేసేదేనని ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అన్నాడు. టీ20 ప్రపంచకప్‌ భారత్‌లో జరుగనున్న నేపథ్యంలో.. ఇక్కడి పరిస్థితులకు బాగా అలవాటు పడేందుకు తమ ఆటగాళ్లకు ఐపీఎల్‌ గొప్ప అవకాశం అని పేర్కొన్నాడు. ‘గత అయిదేళ్లుగా ఐపీఎల్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్ల సంఖ్య పెరుగుతోంది. వ్యక్తిగతంగానే కాకుండా మా జట్టులో ఉన్నవాళ్లందరికీ ఇది గొప్పే. ప్రపంచంలోనే అత్యుత్తమ లీగ్‌లో ఆడటం ద్వారా మంచి అనుభవం లభిస్తుంది. సత్తాచాటాలన్న నిరంతర ఒత్తిడి కూడా మంచిదే’ అని అన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత టీ20 ప్రపంచకప్‌ భారత్‌లో జరుగనున్న నేపథ్యంలో.. ఇక్కడి పరిస్థితులకు బాగా అలవాటు పడేందుకు ఇంగ్లీష్ ఆటగాళ్లకు ఐపీఎల్‌ 2021 గొప్ప అవకాశం’ అని బెన్‌ స్టోక్స్‌ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2021 ఆరంభానికి సమయం దగ్గరపడుతోంది. 14వ ఎడిష‌న్ ఐపీఎల్.. ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభమయి మే 30న ముగుస్తుంది. ఐపీఎల్‌ 2021 కోసం పలు జట్లు తమ సాధనను ముమ్మరం చేశాయి.‌

Related posts