telugu navyamedia
తెలంగాణ వార్తలు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసానికి కారణం టీఆర్ఎస్..

టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యమే సి కింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసానికి కార‌ణ‌మ‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.

శుక్రవారం నాడు బాస‌ర‌కుకు వెళ్తున్న బండి సంజయ్ ను బిక్కనూరు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. అగ్నిపథ్‌కు ఆర్మీ విద్యార్థులకు సంబంధం లేదని తెలిపారు..

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం గుండాలు విద్యార్థుల ముసుగులో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారన్నారు

వేలాది మంది అభ్యర్థులు సికింద్రాబాద్ స్టేషన్ ను ముట్టడిస్తుంటే ఇంటలిజెన్స్ ఏం చేస్తుందని బండి సంజయ్ ప్రశ్నించారు.

నిన్న కాంగ్రెస్ పార్టీ చేసిన విధ్వంసం, ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసానికి టీఆర్ఎస్ సహకారం ఉందని బండి సంజయ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు.

తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చేందుకు టీఆర్ఎస్ , కాంగ్రెస్, ఎంఐఎం లు కలిసి విధ్వంసాలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. సికింద్రాబాద్ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలన్నారు. 

అగ్నిపథ్ వల్ల అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగదని ఆయన చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మోదీయువతకు అన్యాయం చేసే పని మోదీ ప్రభుత్వ చేయదని బండి సంజయ్ అన్నారు. కచ్చితంగా వాళ్ల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని దేశ సేవ కోసం అగ్నిపథ్ తీసుకొచ్చారన్నారు.

ఆర్మీలో చేరాలనే కోరికే ఉన్నతమైందన్నారు. ఆర్మీలో  ఉద్యోగం కోసం  ఆరాటపడుతున్న అభ్యర్ధులను అభినందించారు. దేశ రక్షణ కోసం దేశ భక్తులుగా మారి ఆర్మీలో చేరడానికి ప్రయత్నిస్తున్న అభ్యర్ధులకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయదన్నారు. మీ ఉద్యోగాలు, మీ భవిష్యత్తును కాపాడే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. 

కావాలనే కొందరు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని… వాళ్ల ట్రాప్‌లో పడొద్దని యువతకు సూచించారు.

Related posts