బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కుమార్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటితో ముగిసింది. హనుమకొండ భద్రకాళి అమ్మవారి పాదాల చెంత వరకు పాదయాత్ర కొనసాగించారు. మూడో విడత చివరి రోజు బండి సంజయ్ 14 కిలోమీటర్లు నడిచారు.
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ లక్షణ్ ఇతర నేతలతో కలిసి భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని బండి సంజయ్ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన జేపీ నడ్డాకు అరచ్చకు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. ప్రత్యేకలు నిర్వహించి, ప్రసాదం అందజేశారు.