telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ కార్మికులు ఎవరూ సంతోషంగా లేరు: అశ్వత్థామరెడ్డి

tsrtc union president aswathamareddy on kcr

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఎవరూ సంతోషంగా లేరని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ అశ్వత్థామరెడ్డి అన్నారు. మహిళల పని వేళల విషయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలను కూడా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. సమ్మె కాలంలో కొందరు అధికారులు అవినీతికి పాల్పడ్డారని, వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రెండేళ్ల పాటు యూనియన్లు వద్దంటూ ఆర్టీసీ కార్మికులతో సంతకాలు చేయించుకుంటుండటం సరికాదని విమర్శించారు. యూనియన్లు ఉండాలా? వద్దా? అనే విషయంపై రహస్య ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. హైదరాబాదులో 3,500 బస్సుల్లో వెయ్యి బస్సులను రద్దు చేస్తున్నారని అశ్వత్థామరెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ చర్య వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురౌతాయని చెప్పారు.

Related posts