telugu navyamedia
ఆంధ్ర వార్తలు

‘అగ్నిపథ్‌’ ఆందోళనలు పథకం ప్రకారమే ..ప్రజాస్వామ్య దేశంలో అల్లర్లు సమంజసం కాదు..

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన హింసాత్మక ఘటన దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘అగ్నిపథ్‌’ విషయంలో యువతను తప్పుదారి పట్టిస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

ఈ సంద‌ర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. .ఈ ఘటన పథకం ప్రకారమే కుట్రచేసి విధ్వంసం సృష్టించార‌ని ఆరోపించారు. ఉదయం నుంచి ఆందోళనకారులు ధర్నా చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆయన అన్నారు

అగ్నిపథ్ బలవంతపు ట్రైనింగ్‌ కాదని, స్వచ్ఛందంగానే సైన్యంలో చేరవచ్చన్నారు. జాతీయభావం తీసుకురావడంతో భాగంగా అగ్నిపథ్‌ను తీసుకువచ్చాము.

మోదీ ప్రధాని కాకముందు నుంచే అగ్నిపథ్‌పై దేశంలో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. అనేక దేశాల విధానాన్ని పరిశీలించాకే అగ్నిపథ్‌ తీసుకొచ్చామని కిషన్‌రెడ్డి తెలిపారు.  

అగ్నిపథ్‌లో చేరడం యువకులకు అదనపు అర్హత. దేశ సేవ చేయాలనుకునే వాళ్లు అగ్నిపథ్‌ లో పాల్గోవచ్చాన్నారు. ప్రజాస్వామ్య దేశంలో అల్లర్లు సమంజసం కాదు.. సంయమనం పాటించాలని కిషన్​రెడ్డి తెలిపారు..

Agneepath-Scheme-Protest-in-Hindi.jpg

 రైల్వే కోచ్‌లు తగలబెడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. రైల్వే స్టేషన్‌ను టార్గెట్‌ చేసి దాడి చేశారు. 6 గంటల పాటు రైల్వే స్టేషన్‌లో అలజడి సృష్టించారు. బైకులు, రైల్వే ప్రాపర్టీ, స్టాల్స్‌ను తగులబెట్టారు.

ప్రయాణికులు సామాన్లు కూడా వదిలిపెట్టి భయంతో పరిగెత్తే పరిస్థితి తీసుకొచ్చారని వాపోయారు. పథకం ప్రకారం కుట్ర చేసి రైల్వే స్టేషన్‌ను లక్ష్యంగా ఎంచుకోవడం దారుణమని.. ఈ ఘటనలో రాష్ట్ర పోలీసులు చూస్తూ ఉండిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బాధ్యత లేదా? ఇన్ని జరుగుతున్నా సకాలంలో పోలీసులు ఎందుకు రాలేద‌ని ప్ర‌శ్నించారు. శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు.

Related posts