telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలుగు రాష్ట్రాలపై … మరో తుఫాన్ దాడికి సిద్ధం..ప్రభుత్వ సూచనలు..

fani cyclone effect on badrachalam

తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాన్ దాడికి సిద్ధంగా ఉన్నాడని, అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. అరేబియాలో కొనసాగుతున్న అల్పపీడనం మరో 12 గంటల్లో తీవ్రమైన తుఫాన్‌గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఈ తుఫాన్‌కు ‘క్యార్రా’ అని అధికారులు నామకరణం చేశారు. రానున్న 24 గంటల్లో ఈ తుఫాన్ తీవ్ర రూపం దాల్చుతుందని.. దాని ప్రభావంతో గంటకు 85 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అన్నారు.

‘క్యార్రా’ తుఫాన్ ప్రభావం వల్ల రానున్న ఐదు రోజుల్లో దక్షిణ భారతంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణాలో ఆదివారం పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చునని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ తుఫాన్ ప్రభావంతో మహారాష్ట్ర, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీని దృష్ట్యా గోవా ప్రభుత్వం ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేస్తూ రెడ్ అలెర్ట్ కూడా ప్రకటించింది.

Related posts