telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక సినిమా వార్తలు

ఊహ తెలిశాక మొట్టమొదటి హీరో మీరే: ఎన్టీఆర్

ntr

నందమూరి బాలకృష్ణ 60వ బర్త్‌డే సందర్భంగా ఆయనకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో బాలయ్య అన్న కొడుకు జూనియర్ ఎన్టీఆర్‌ తమ ట్విట్టర్‌ ద్వారా ప్రత్యేక శుభాకాంక్షలు అందించారు. “నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే. నాకు ఊహ తెలిశాక చూసిన మొట్టమొదటి హీరో మీరే అని వ్యాఖ్యానించారు.

ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. 60వ బర్త్‌డే శుభాకాంక్షలు .. జై బాలయ్య ! అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్‌ చేశారు. బాలకృష్ణకు నేడు పలువురు రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు శుభాభినందనలు తెలియజేస్తూ, ట్వీట్లు పెడుతున్నారు. కాగా, నేటి పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నారన్న సంగతి తెలిసిందే.

Related posts