telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యాత్ర : వైఎస్ రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు

Jagapathi-babu

జ‌న‌నేత‌గా తెలుగు వాళ్ల గుండెల్లో ప‌దిల‌మైన చోటు ద‌క్కించుకున్న నాయ‌కుడు, ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వై.య‌స్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు పేద‌ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల్ని నేరుగా విన‌టానికి మొదలుపెట్టిన పాద‌యాత్ర‌లో ముఖ్య ఘ‌ట్టాల‌న్ని తీసుకుని యాత్ర  పేరుతో భారీగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.  వై ఎస్ ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం.. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ యాత్ర. మలయాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి వై ఎస్ ఆర్ పాత్రలో జీవిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ అండ్ డైలాగ్ టీజ‌ర్ల‌తో ఈ విషయం స్పష్టమైంది. ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ్ ఈ యాత్ర‌ ని తెర‌కెక్కిస్తున్నారు. 70 ఎం ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అత్యంత భారీ వ్య‌యంతో, ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ  చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి శివ మేక సమర్పకుడు. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ళ‌యాలంలో కూడా యాత్ర చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 8న రిలీజ్ చేస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో వైఎస్ఆర్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఫ్యాక్షనిస్టుగా గుర్తింపు పొందిన రాజిరెడ్డి గురించి పులివెందులలో ఇప్పటికీ చెప్పుకుంటారు. తాజాగా రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లుక్ లో జగపతి బాబు ఖద్దరు చొక్కాతో కోర మీసంతో ఉన్నారు. ఇంకా రావు రమేష్, పోసాని కృష్ణమురళి, అనసూయ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

Related posts