telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సెన్సేషనల్ రికార్డు సాధించిన మహేష్ ప్లాప్ సినిమా

Mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆగడు’. 2014లో వచ్చిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ సినిమా ఓ రికార్డు క్రియేట్ చేయడం విశేషం. ఇదే సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్ లో ఏకంగా 500 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకొని సెన్సేషనల్ రికార్డును సాధించింది. హిందీ డబ్బింగ్ లో విడుదల చేయబడ్డ అన్ని వెర్షన్స్ వ్యూస్ కలిపితే ఈ చిత్రానికి 500 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇండియన్ సినిమాలో ఈ మార్క్ అందుకున్న మొదటి సినిమాగా ‘ఆగడు’ నిలిచింది. అయితే ఓ హిట్ సినిమా కొత్త రికార్డులను నెలకొల్పడం సహజం. కానీ ప్లాప్ సినిమా రికార్డు క్రియేట్ చేయడం అనేది విశేషమే మరి.

Related posts