telugu navyamedia
సినిమా వార్తలు

నాకు పగ, రాగద్వేషాలు లేవు..

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్​ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణం స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మోహన్ బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.’మా’ కుర్చీలో కూర్చున్న వ్యక్తిని గౌరవించాలి. మనుషుల్లో టాలెంట్‌ ఉంటే అవకాశాలు వస్తాయి. కేవలం టాలెంట్‌తోనే ఇక్కడ కొనసాగగలరు. నా జీవితం తెరిచిన పుస్తకం. నా పుస్తకంలో విలన్‌గా చెయ్యాలని అనుకున్నాను. విలన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, హీరోగా చేశాను’ అంటూ వ్యాఖ్యానించారు. అలాగే ‘ఇక్కడ రాజకీయాలు ఉండకూడదు. ఇది రాజకీయ వేదిక కాదు, కళకారుల వేదిక. పాలిటిక్స్‌లో ఉన్నవి కంటే ఇక్కడ ఎక్కువ జరుగుతున్నాయని, ఇలాంటివి కూడా ఉంటాయా? అని ఆశ్చర్యపోయానన్నారు.

‘మా’ లో మేమంతా ఒకే తల్లి బిడ్డలం. కళామతల్లి బిడ్డల్లో ఐక్యత లోపించింది. టీవీలకు వెళ్లి మనుషులను రెచ్చగొట్టొద్దు. ఎన్నికల అధికారి పక్షపాతం లేకుండా వ్యవహరించారు. ‘మా’ రాజకీయ వేదిక కాదు, కళాకారుల వేదిక. సినీ పరిశ్రమలో రాజకీయాలు ఎక్కువైపోయాయి. ఇక్క‌డ‌ గెలుపు ఓటములు సహజం. నువ్వుగొప్పా.. నేను గొప్పా.. సినిమాలు ఉన్నాయా.. లేవా అన్నది కాదు. సినిమాలు ఉంటాయి. ప్లాప్స్‌ వస్తాయి. జయాపజయాలు దైవాధీనాలు. సక్సెస్‌ ఫెయిల్యూర్స్‌ ఆర్ కామన్. వీర్రవీగుతాం నేనేంతా అని? కానీ దేవుడు మరుక్షణమే దిమ్మతిరిగేటట్లు కొడతాడు. మేము చాలా మంది అంటూ బెదిరించారు. కానీ ఆ బెదిరింపులకు ఎవరూ భయపడలేదు.” అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

MAA Elections 2021 Mohan babu sensational comments on MAA Elections polling: బెదిరించినా భయపడకుండా ఓటు వేశారు : మోహన్‌బాబు | వినోదం News in Telugu

ఎవరికీ భయపడకుండా మా ఓటు మాకు సంతమని నా బిడ్డను గెలపించారు అంటూ విష్ణు ఎన్నికపై మోహన్ బాబు వ్యాఖ్యానించారు. మీ రుణం తీర్చుకోలేను, నాకు పగ, రాగద్వేషాలు లేవు.. మీరే నా బిడ్డకు దేవుళ్లు.. ఓటు వేయని వాడి మీద పగవద్దు కక్ష వద్దు. అది సర్వనాశనం చేస్తుంది. అని మోహన్ బాబు దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేశారు. నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా..అందరం కలిసి మెలిసి ఉందామ‌ని అన్నారు.

విష్ణు భారతదేశం గర్వించదగ్గ స్థాయిలో ‘మా’కి పేరు ప్రఖ్యాతులు తీసుకు రావాలి.త్వరలోనే ఏపీ సీఎం జగన్‌ను కూడా కలుస్తామ‌ని, కేసీఆర్ కళాకారులకు ఎంతో సహాయం చేస్తారు. నేను కూడా వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలుస్తాను” అని మోహన్​బాబు చెప్పారు.”ఇక్కడ విర్రవీగేవాళ్లు చాలా మంది ఉన్నారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే సినీ పరిశ్రమలో తప్పుబడతారు. మంత్రి శ్రీనివాసయాదవ్ చెప్పినట్లు నా కోపం నాకు చెడు చేసింది. విష్ణు ప్రామిస్ చేసినవన్నీ నెరవేరుస్తాడని భావిస్తున్నాను. కలసి మెలసి ఉందాం. కలసి కట్టుగా సాధిద్దాం. సమస్యలు ఉంటే అధ్యక్షుడి దృష్టికి తీసుకురండి అని చెప్పారు.

“టీవీలకు ఎక్కడం ఇకనైనా మానేయండి. పదే పదే రెచ్చగొడితే చూస్తూ కూర్చొలేం.  రెచ్చగొట్టడడం మానుకోండి. అందరం కలిసి పనిచేద్దాం. పదే పదే రెచ్చగొడితే గుడిసెలో ఉన్నవాడైనా రెచ్చిపోతాడు ప్రత్యర్ధి వర్గానికి చురకలు అంటించారు.

Related posts