స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా ఆలియా భట్ హీరోయిన్ గా దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన బిగ్గెస్ట్ చిత్రం ఇది. రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్, నాగార్జున, అమితాబ్ బచ్చన్ లతో భారీ మల్టీస్టారర్ గా ఈ సినిమా రూపొందుతుంది.
‘బ్రహ్మాస్త్ర’ను తెలుగు, హిందీ సహా కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతమందిస్తున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను 2022 సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నారు.
తెలుగు వెర్షన్ కి సంబంధించి హైదరాబాద్‌లోని సినీ మ్యాక్స్ థియేటర్‌లో రిలీజ్ చేశారు. ఈ వేడుకలో కరణ్ జోహర్, ఆయన్ ముఖర్జీ, నాగార్జున, ఆలియా భట్, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి సినిమా గురించి, డైరెక్టర్ గురించి మాట్లాడారు. బ్రహ్మస్త్ర’ మోషన్ పోస్టర్ రిలీజ్ ఈవెంట్‌కు నేను వచ్చే వాడ్ని కాదు. ఈ సినిమాని నేను సమర్పించేవాడ్ని కూడా కాదు. కానీ కరణ్ జోహర్ నన్ను ఒప్పించి ఇక్కడిదాకా లాక్కోచ్చారు.
“బాలీవుడ్లో నా ఫేవరెట్ హీరో రణ్‌బీర్. అతను పెద్దగా యాక్టింగ్ చేస్తున్నట్లు కనపడడు. కళ్లలోనే ఇంటెన్సిటీ కనబడుతుంది. చూసేందుకు నార్మల్గా కనబడినా అతడిలోపల ఎంతో శక్తి దాగుంది. అచ్చం శివుడిలా. ఈ సినిమాలో అతడిని ఎంపిక చేయడమే పెద్ద ప్లస్. ఇక దర్శకుడు అయాన్ తొలుత నా దగ్గరికి వచ్చినప్పుడు.. ఇతను నాకన్నా పిచ్చోడిలా ఉన్నాడే అనిపించింది.
కానీ ఏడేళ్లుగా బ్రహ్మస్త్ర సినిమాపై పెట్టిన సమయం, హార్డ్ వర్క్ చూసి నాకు నచ్చింది. సినిమాపై పెడుతున్న అతడి అంకితభావం చూసి నాకు అతడి పై గౌరవం పెరిగింది” అని అన్నారు. ‘బ్రహ్మాస్త్ర’ గురించి చెబుతుంటే.. ఒక బ్రహ్మాండం సృష్టించబోతున్నాడనిపించిందని రాజమౌళి అన్నారు.