telugu navyamedia
తెలంగాణ వార్తలు

అంబేడ్కర్ విగ్రహం ఎదుట వీహెచ్ ధ‌ర్నా..

 

*వీహెచ్ ఇంటిపై రాళ్ల దాడి, కారు ధ్వంసం..
*అంబేడ్కర్ విగ్రహం ఎదుట వీహెచ్ ధ‌ర్నా..
*నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..

కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఇంటిపై బుధవారం అర్థరాత్రి రాళ్లతో దాడి చేశారు. ఇంటి ఎదురుగా ఉన్న వీహెచ్ కారును కూడా ధ్వంసం చేశారు. హైదరాబాద్ లోని డీడీ కాలనీలో వీహెచ్ నివాసం ఉంటుండగా అక్కడే ఈ ఘటన జరిగింది. దీంతో వెంటనే వీహెచ్ అంబర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Telangana Congress leader V Hanumantha Rao's house allegedly attacked by 'goons' - The New Indian Express

మ‌రోవైపు తన ఇంటిపై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని, అతణ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వీహెచ్ ట్యాంక్ బండ్ పైన ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. దీనిపై అంబేడ్కర్ కమిటీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో పోలీసులు వీహెచ్ ఇంటిపై దాడికి పాల్పడిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయన ఆందోళన విరమించారు. అతను ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వాడు అని , గత ఆరు నెలలుగా వీహెచ్ ఇంటి పక్కనే సిద్ధార్థ్ సింగ్ నివాసం ఉంటున్నాడు.

 

Related posts