తిరుమల తిరుపతి దేవస్థానం (టీడీడీ) స్వామివారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసింది. 2019 డిసెంబర్ నెలకు సంబంధించి 68,466 టికెట్లు విడుదల చేసినట్లు టీటీడీ ఈవో వెల్లడించారు. ఎలక్ట్రానిక్ లాటరీ విధానం కింద 6,516 సేవా టికెట్లు, సుప్రభాతం 3856, తోమాల 60, అర్చన 60, అష్టదళ పాదపద్మారాధన 240, నిజపాద దర్శనం కోసం 2300 టికెట్లను విడుదల చేశారు. కరెంట్ బుకింగ్ కింద మరో 61,950 ఆర్జిత సేవా టికెట్లు విడుదలయ్యాయి. విశేష పూజకు 2500, కల్యాణోత్సవం 13,775, ఊంజల్ సేవ 4350, ఆర్జిత బ్రహ్మోత్సవం 7975, వసంతోత్సవం 15,950, సహస్ర దీపాలంకరణ కోసం 17400 టికెట్లను టీటీడీ విడుదల చేసింది.
							previous post
						
						
					


చంద్రబాబు మహాకూటమి కట్టి కేసీఆర్ నెత్తిన పాలుపోశారు: ఉండవల్లి