telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

ఆఫీసుల్లో కూడా .. అంతర్జాలంలో కాలక్షేపం.. ఉద్యోగాలకు ఎసరు..

indians browsing time mostly in office timings

ఇంటర్నెట్లో విహరించడం స్మార్ట్‌ఫోన్లు వచ్చాక చాలా సులువు అయింది. భారతీయుల్లో అత్యధికులు ఆఫీసు సమయంలోనే.. అంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఆన్‌లైన్‌ కంటెంట్‌ను ఎక్కువగా ఆస్వాదిస్తున్నారని కేపీఎంజీ, ఇరోస్‌ నౌ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. ఆన్‌లైన్‌ వీడియో ప్లాట్‌ఫామ్స్‌పై సగటున రోజుకు 70 నిముషాలకుపైగా సమయం వెచ్చిస్తున్నారట. హైదరాబాద్‌ సహా 16 నగరాల్లో చేపట్టిన ఈ సర్వేలో 1,458 మంది ఓవర్‌ ద టాప్‌ యూజర్లు పాల్గొన్నారు.

వీరిలో 87 శాతం మంది ఆన్‌లైన్‌ కంటెంట్‌ను తమ ఫోన్లలోనే వినియోగిస్తున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 మధ్య వీడియోలు, చిత్రా లను చూస్తున్నవారు 28 శాతం మంది ఉన్నారు. వీరు మూవీస్‌నే ఎక్కువగా వీక్షిస్తున్నారు. ఒరిజినల్, కొత్త కంటెంట్‌ను ఆస్వాదించేందుకే ఇష్టపడుతున్నారు.

Related posts