telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ గవర్నర్ తో.. సీఎం భేటీ ..

apcm meet with ap governor today

ఏపీ కొత్త గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు గవర్నర్ హరిచందన్ తో భేటీ కానున్నారు. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ఈ భేటీ జరగనుంది. దీంతో గవర్నర్ , సీఎం ల భేతీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సుమారు గంటపాటు వీరి మధ్య సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన సమస్యలు, తాజా రాజకీయ పరిస్థితులతో పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై గవర్నర్‌కు నిశితంగా వివరించనున్నారు జగన్ . దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న జగన్ తీసుకున్న నిర్ణయాలపై, పలు కీలక అంశాలపై జగన్ గవర్నర్ కు వివరించే అవకాశం ఉంది.

గతంలో గవర్నర్ నరసింహన్ జగన్ కు సానుకూలంగానే ఉన్నారు. మరి తాజా గవర్నర్ సీఎం జగన్ విషయంలో భవిష్యత్ లో ఎలాంటి వైఖరి కనబరుస్తారో .. పక్కా బీజేపీ వాది అని బిస్వభూషణ్ హరి చందన్ కు పేరున్న నేపధ్యంలో జగన్ తీసుకునే ప్రతి నిర్ణయానికి ఆయన అనుమతి లభిస్తుందా ? వీరి మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయా అన్న ఆలోచన ఇప్పుడు అందరి మనసుల్లో మెదులుతుంది. ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్ జులై 24న ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు . ఏపీ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు .ఇందుకోసం ఒకప్పుడు సీఎం క్యాంప్ కార్యాలయం అయిన భవనాన్ని రాజ్‌భవన్‌ గా మార్చారు. విభాజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన ఇంత కాలానికి ఏపీకి గవర్నర్ ను నియమించిన నేపధ్యంలో ఆయన ప్రస్తుత ప్రభుత్వంతో ఎలా ఉంటారు అన్నది ప్రధానాంశంగా మారింది. ఇక నేటి జగన్ తో గవర్నర్ భేటీ ఆసక్తికరంగా మారింది.

Related posts