telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌పై పేర్ని నాని కౌంటర్‌

జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏపీ మంత్రి పేర్ని నాని మధ్య మొదలైన మాటల యుద్ధం కొనసాగుతోంది. రిపబ్లిక్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ చేసిన వ్యాఖ్యలపై మొన్న మంత్రి పేర్ని నాని తీవ్రంగా విరుచుకుపడ్డారు. తీవ్ర పదజాలంతో పవన్‌పై విమర్శలు చేశారు.

నాని వ్యాఖ్యలపై పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్ ద్వారా స్పందించారు.. ‘‘తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామ సింహాల గోంకారాలు సహజమే’’ అంటూ నిన్న రాత్రి ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌పై  స్పందించిన మంత్రి పేర్ని నాని అదే స్థాయిలో మళ్లీ విరుచుకుపడ్డారు. ‘‘జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు న‘మస్కా’రాలు’’ అని ట్వీట్ చేస్తూ పవన్‌పై ఓ ట్రోలింగ్ వీడియోను షేర్ చేశారు.

Related posts