telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీలో కరోనా విలయం : జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

cm jagan

ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 9.37 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్  ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 4,157 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,37,049 కు చేరింది. ఇందులో 901327 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 28,383 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఈ నేపద్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో కోవిడ్ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్‌ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించారు. 21 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. టాస్క్ ఫోర్సులో సీనియర్ ఐఏఎస్ అధికారులు కృష్ణబాబు, రవిచంద్ర, పీయూష్‌కుమార్‌, బాబు.ఎ, మల్లికార్జున్‌, విజయరామరాజు, అభిషేక్‌ మహంతి, శ్రీకాంత్‌ వంటి అధికారులకు టాస్క్ ఫోర్స్ లో చోటు కల్పించింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ పర్యవేక్షణకు జిల్లాలకు ప్రత్యేక అధికారులను కేటాయించింది. 13 జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం చేపట్టింది ఏపీ సర్కార్.

Related posts