telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

12 ప్రైవేట్ ఐటీఐలకు ఏపీ సర్కార్‌ గ్రీన్ సిగ్నల్‌

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ సారధ్యంలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ మరో ఘట్టానికి నాంది పలికింది. ఆంధ్రప్రదేశ్ లో 12 ప్రైవేట్ ఐటీఐలకు ఏపీ సర్కార్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  విజయనగరం, విశాఖ, తూ.గో, కృ ష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఎనిమిది ప్రైవేట్‌ ఐటీఐలకు అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ప్రకాశం జిల్లాలో ఐదు, తిరుపతిలో రెండేసి ప్రైవేట్‌ ఐటీఐలకు, మిగిలిన చోట్ల ఒక్కో ఐటీఐ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది జగన్ ప్రభుత్వం. విజయనగరం జిల్లా మంగపాలెం, విశాఖ జిల్లా కొత్త కొవ్వాడ, తూ.గో జిల్లా గుడిమెల్లంక, కృష్ణా జిల్లా కలవపాముల, గుంటూరు జిల్లా నగరం, తిరుపతిలో రెండు ప్రైవేటు ఐటీఐలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ప్రకాశం జిల్లా చౌటపాలెం, మెదర మెట్ల(2), పొదిలి, కనిగిరి, గ్రామాల్లో ప్రైవేట్ ఐటీఐలకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.

Related posts