telugu navyamedia
రాజకీయ

ఎంపీ ఆజంఖాన్‌ను క్ష‌మించేది లేదు:  డిప్యూటీ స్పీక‌ర్ ర‌మాదేవి 

Azam Khan

లోక్‌స‌భ‌లో ట్రిపుల్ త‌లాక్ బిల్లుపై చ‌ర్చ స‌మ‌యంలో గురువారం  స‌మాజ్‌వాదీ పార్టీ  ఎంపీ ఆజంఖాన్ డిప్యూటీ స్పీక‌ర్‌  ర‌మాదేవి పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. దీంతో స‌భ‌లో ర‌భ‌స మొద‌లైంది. మ‌హిళా మంత్రులు, ఎంపీలంతా ఆజంపై చ‌ర్య తీసుకోవాల‌ని స్పీక‌ర్‌ను కోరారు. ఈ నేపథ్యంలో ఆజంఖాన్‌ వ్యాఖ్యలపై  డిప్యూటీ స్పీక‌ర్ ర‌మాదేవి ఘాటుగా స్పందించారు.  అనుచిత వ్యాఖ్య‌లు చేసిన  ఆజంఖాన్‌ను ఎన్న‌టికీ క్ష‌మించేది లేద‌ని డిప్యూటీ స్పీక‌ర్ ర‌మాదేవి అన్నారు. ఆమె ఓ మీడియా సంస్థ‌తో ఆమె మాట్లాడుతూ ఆజం రెండు సార్లు త‌న‌ను అవ‌మానించార‌న్నారు. అనుచిత వ్యాఖ్య‌లు చేసిన  త‌ర్వాత వెంట‌నే ఆయ‌న క్ష‌మాప‌ణ చెప్ప‌లేద‌న్నారు. 

స‌భ‌లో ఉన్న ప్ర‌తి ఒక్క‌ర్నీ గౌర‌వంగా చూస్తాన‌ని చెప్పారు.  ఆజం త‌న వైపు చూసి మాట్లాడ‌డం లేద‌ని, ఎంపీల వైపు చూస్తు ఆయ‌న మాట్లాడుతున్నార‌ని దుయ్యబట్టారు.  ఆజం వ్యాఖ్య‌ల‌కు అప్పుడే కౌంట‌ర్ ఇచ్చేదాన్ని అని, కానీ గౌర‌వ‌నీయ‌మైన చైర్‌లో కూర్చుని అలా చేయ‌డం త‌గ‌దు అనిపించింద‌న్నారు. ప్ర‌తి ఒక‌రికీ త‌ల్లి, సోద‌రి, కుమార్తె, భార్య ఉంటార‌ని.. ఆజం వ్యాఖ్య‌లు మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచే విధంగా ఉన్నాయ‌ని ర‌మాదేవి అన్నారు.

Related posts