telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో ఇక 26 జిల్లాలు..కొత్త జిల్లాలు పేర్లు ఇవే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం కూడా తీసుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటు వివరాలను మంత్రులకు ఆన్‌లైన్‌లో పంపి వారి ఆమోదం తీసుకుంది.

ప్ర‌స్తుతం రాష్ర్టంలో 26 జిల్లాలకు సంబంధించి రెవెన్యూ సరిహద్దులు, జిల్లా కేంద్రాలను ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 13 జిల్లాల స్థానంలో ఇక నుంచి 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే ఉగాది నాటికి ఈ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

అరకు లోక్‌స‌భ‌ స్థానం భౌగోళిక విస్తీర్ణం చాలా పెద్దది కావడంతో.. దాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారు. మంగళవారం రాత్రి 8 గంటలకు ఆన్లైన్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య మంత్రి ధర్మాన కృష్ణదాస్ కొత్త జిల్లాల ప్రతిపాదనను మంత్రివర్గం ముందు ఉంచారు. మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. 

ఈ సమావేశానికి ముందు మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. కొత్త జిల్లాల ప్రక్రియ గురించి అభ్యంతరాలు, సూచనలు ఉంటే స్వీకరిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలియజేయాలని స్పష్టం చేశారు.

కొత్త జిల్లాలు ఇవే..

జిల్లా పేరు – జిల్లా కేంద్రం

శ్రీకాకుళం – శ్రీకాకుళం
విజయనగరం – విజయనగరం
మన్యం జిల్లా – పార్వతీపురం
అల్లూరి సీతారామరాజు జిల్లా – పాడేరు
విశాఖపట్నం – విశాఖపట్నం
అనకాపల్లి – అనకాపల్లి
తూర్పుగోదావరి – కాకినాడ
కోనసీమ – అమలాపురం
రాజమహేంద్రవరం – రాజమహేంద్రవరం
నరసాపురం – భీమవరం
పశ్చిమగోదావరి – ఏలూరు
క్రిష్ణా – మచిలీపట్నం
ఎన్టీఆర్ జిల్లా – విజయవాడ
గుంటూరు – గుంటూరు
బాపట్ల – బాపట్ల
పల్నాడు – నరసరావుపేట
ప్రకాశం – ఒంగోలు
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు – నెల్లూరు
కర్నూలు – కర్నూలు
నంద్యాల – నంద్యాల
అనంతపురం – అనంతపురం
శ్రీ సత్యసాయి జిల్లా – పుట్టపర్తి
వైఎస్ఆర్ కడప – కడప
అన్నమయ్య జిల్లా – రాయచోటి
చిత్తూరు – చిత్తూరు
శ్రీబాలాజీ జిల్లా – తిరుపతి.

Related posts