telugu navyamedia
సినిమా వార్తలు

అనుపమ బటర్‌ఫ్లై టీజర్‌ రిలీజ్‌..

కేరళ కుట్టీ అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న థ్రిల్లర్ మూవీ ‘బటర్ ఫ్లై’. ఇటీవల పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌లైన‌ బటర్ ఫ్లై ఫస్ట్‌ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సీతాకోక చిలుక పెయింటింగ్ పై అనుపమా కూర్చుని దేనికోసమే చూస్తున్న‌ లుక్ ఆకట్టుకుంది.

తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. సుమారు 40 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో ఎలాంటి డైలాగులు వినిపించవు. టీజర్‌ మొత్తం అనుపమే కనిపిస్తోంది. ‘నీ కళ్లను నమ్మద్దు.. బ్రెయిన్‌ను కూడా నమ్మద్దు.. మరి వేటిని నమ్మాలి’ అంటూ టీజర్ లో వచ్చిన కొన్ని సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దీనిని చూస్తోంటే మిస్టరీ, హార్రర్‌ జోనర్‌లో ఈ సినిమాను తెరకెక్కించారని అర్థమవుతోంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో టీజర్ వైరల్ అవుతోంది.

జెన్ నెక్స్ట్ మూవీ బ్యానర్ పై రవిప్రకాశ్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఘంటా సతీశ్ బాబు కథ, స్ర్కీన్ ప్లే , దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ఇంకా భూమిక చావ్లా, నీహాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

లేడీ ఓరియంటెడ్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని అప్‌డేట్స్ ను త్వరలోనే ప్రకటించనుంది చిత్రబృందం.

Related posts