telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆచార్యలో మరో స్టార్ హీరో..?

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’ సినిమా చిరంజీవికి ప్రతిష్టాత్మకంగా మారింది. కాజల్ అగర్వాల్ మరోసారి చిరుతో ఈ సినిమాలో జతకట్టింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్  చిరంజీవి అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. పైగా రాంచరణ్ కూడా ఇందులో నటిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో 25 కోట్ల విలువైన భారీ సెట్ నిర్మించారు. సినిమాలో ఎక్కువ భాగం అక్కడే పూర్తవుతుంది. ఈ సినిమాను నిరంజన్ రెడ్డి,  రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉందని, అందులో మరో స్టార్ హీరో చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఆ పాత్రకు కిచ్చ సుదీప్‌ని చిరు రెకమెండ్ చేశారని కూడా టాక్ వస్తుంది. ఇది ఇంకా చర్చల దశలో ఉందంట. మరి ఈ అవకాశాన్ని సుదీప్ ఓకే చేస్తారో లేదో చూడాలి. అయితే ఇదివరకే కిచ్చ సుదీప్ తెలుగులోని కొన్ని పాత్రలు చేసి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. మరి ఈ సినిమాలో కూడా సుదీప్ కనిపిస్తారేమో చూడాలి. అయితే ఈ సినిమా మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related posts