telugu navyamedia
సినిమా వార్తలు

సిరి-శ్రీహన్ బ్రేకప్‌..అందుకే ఈ నిర్ణ‌యం..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఎంతటి రసవత్తరంగా సాగిందో.. అంత వివాదస్ప‌ద‌మైంది. బిగ్‌బాస్ రెండు జంటల మధ్య చిచ్చు పెట్టింది. ఎన్నో ఏళ్లుగా క‌లిసి ప్రేమ‌లో ఉన్న వీరి బంధానికి బీట‌లు వ‌చ్చాయి.

బిగ్‌బాస్ సిరి షణ్ముక్ ప్ర‌వ‌ర్తించిన తీరు వల్ల వారి లవ్ లైఫ్‌లో అపార్ధాలు చోటు చేసుకున్నాయి. హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక‌ షణ్ముఖ్, సిరిలు సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నారు.

రెండు జంటల మధ్య బిగ్ బాస్ చిచ్చు.. బ్రేకప్ బాటలో శ్రీహాన్ – సిరి..? | Shrihan  Deleting siri Photos In Instagram

ఇప్పటికే దీప్తి సునయన షణ్ముక్‌కు బ్రేకప్‌ చెప్పేసింది. తమ దారులు వేరంటూ 5ఏళ్ల బంధానికి ముగింపు పలికింది. ఇప్పుడు దీప్తి సునయన బాటలోనే సిరి బాయ్‌ఫ్రెండ్‌ శ్రీహాన్‌ కూడా పయనిస్తున్నట్లు తెలుస్తుంది.

గత కొన్ని రోజులుగా సిరిని దూరం పెడుతూ వస్తున్న శ్రీహాన్‌.. త్వరలోనే శ్రీహన్ కూడా సిరికి బ్రేకప్ చెప్పబోతున్నాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా బిగ్‌బాస్‌ షో పూర్తైనా వీరిద్దరూ జంటగా కనిపించలేదు.

ఇటీవ‌ల‌ సిరి పుట్టినరోజు సందర్భంగా శ్రీహన్ తన ఇన్‌స్టాలో స్టేటస్ పెట్టాడు. ”హ్యాపీ బర్త్ డే సిరి.. ఈ సంవత్సరం నీ లైఫ్‌లో మరింత పాజిటివిటీని తీసుకురావాలని.. నీ లక్ష్యాలను త్వరలోనే చేరుకుంటావ్. గాడ్ బ్లెస్ యూ” అంటూ పేర్కొన్నాడు.

Siri Hanmanth's Boyfriend Deletes All Their Pictures From Social Media?

అంతేకాకుండా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో సిరి ఫోటోలన్నింటిని  ఫొటోలన్నింటిని డిలీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. కేవలం ఇద్దరూ కలిసి చేసిన వెబ్‌సిరీస్‌లకు సంబంధించిన అప్‌డేట్స్‌ మినహా సిరితో ఉన్న ఫోటోలన్నింటిని శ్రీహాన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌నుంచి తొలగించాడు. దీంతో వీరిద్దరి మధ్య కూడా బ్రేకప్ అయ్యిందని నెటిజన్లు గుసగుసలాడుతున్నారు.

After Shanmkh And Deepthi Breakup, Shrihan Deleting Siri Pics In Instagram  - Sakshi

బిగ్‌బాస్‌ షోలో అనేక సార్లు షణ్నూతో కనెక్షన్‌ వస్తుందంటూ సిరి చెప్పిన మాటలతో శ్రీహాన్‌ గుండె బద్దలయ్యిందని అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని అంటున్నారు కొందరు. దీనిపై షన్ను- దీపు లా వీరిద్దరూ కూడా  ప్రకటింస్తారేమో చూడాలి.

Related posts