telugu navyamedia
రాజకీయ

కెనడా రక్షణ మంత్రిగా అనితా ఆనంద్..

న్యాయవాది, రాజకీయ నాయకురాలిగా గుర్తింపు పొందిన 54 ఏళ్ల అనితా ఆనంద్ కెనడాలోని ఓక్ విల్లే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జస్టిన్ ట్రూడో నాయకత్వంలోని లిబరల్ పార్టీ నుంచి 46శాతం ఓట్లతో ఆమె గెలుపొందారు. గత మంత్రివర్గంలో ఆమె వ్యాక్సిన్‌ మినిస్టర్‌గా పనిచేశారు. కార్పొరేట్ లాయర్‌గా ప్రస్థానం ఆరంభించిన అనిత రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు.

Image

అనితా ఆనంద్.. కరోనా సంక్షోభ సమయంలో దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందించడంలో సమర్థంగా వ్యవహరించారన్న గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతోపాటు కార్పొరేట్‌ గవర్నెన్స్‌ రంగంలో ఆమెకు సుదీర్ఘ అనుభవం ఉంది. అయితే.. గత మంత్రి సజ్జన్‌పై ఆరోపణల నేపథ్యంలో ఆర్మీలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు అనిత ఆనంద్‌ను రక్షణ మంత్రిగా ఎంపికచేశారు.

Indian-origin Anita Anand is Canada's new Defence Minister as PM Trudeau  reshuffles Cabinet- The New Indian Express

కెనడా డిఫెన్స్ మినిస్టర్‌గా హర్జిత్ సజ్జన్ దీర్ఘకాలం సేవలందించారు. కానీ, ఆయన సారథ్యంలో మిలిటరీలో లైంగిక వేధింపుల కేసులు పెరిగాయి. ఈ నేపథ్యంలో మిలిటరీలో లింగపరమైన పురోగతి రావాలని, దాని సంస్కృతినీ ప్రక్షాళనం చేయాలని చాలా మంది భావిస్తున్నారు. ఈ తరుణంలోనే ఆ శాఖను అనిత్ ఆనంద్‌కే ఇవ్వాలనే డిమాండ్ రావ‌డంతో ట్రూడో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే.. సజ్జన్‌ను అంతర్జాతీయ అభివృద్ధి శాఖ మంత్రిగా నియమించారు. తాజా మార్పుతో కెన‌డా క్యాబినెట్‌లో ఒక సంఖ్య పెరిగి 38 మందికి సభ్యులు చేరారు.

Indian-origin Anita Anand is Canada's new Defence Minister as PM Trudeau  reshuffles Cabinet - The Hindu

Related posts