telugu navyamedia
రాజకీయ

ఇందిరా గాంధీ త‌ర్వాత నిర్మ‌లా సీతారామ‌నే..

Nirmala Sitaraman Responds On Rafale

2014లో బీజేపీ అధికారంలో కి వచ్చినప్పుడు మోదీ ప్రభుత్వంలో  నిర్మ‌లా సీతారామ‌న్ రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు.  ఈసారి తిరిగి  అధికారంలోకి వచ్చాక  మోదీ మంత్రివర్గంలో సీతారామ‌న్ ఆర్థిక శాఖను అప్పగించారు.  ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రక్షణ శాఖ మంత్రిగా పూర్తి స్థాయిలో సేవలు అందించిన మహిళగా  గుర్తింపు పొందిన  ఆమె  ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించారు. భారత దేశ ఆర్థిక శాఖ మంత్రిగా నియమితులయ్యారు. అలాగే కార్పొరేట్ వ్యవహారాల శాఖ కూడా చూసుకోనున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత ఆర్థిక మంత్రిగా ఈ ఘనత దక్కించుకున్న మహిళగా నిర్మ‌లా సీతారామ‌న్ నిలిచారు. 

భార‌త చ‌రిత్ర‌లో ఆర్థిక‌శాఖ‌కు మంత్రిగా చేసిన మ‌హిళ కేవ‌లం ఇందిరా గాంధీ మాత్ర‌మే. 1970-71లో ఇందిరా గాంధీ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. నిర్మలా సీతా రామన్ 1959 ఆగస్టు 18వ తేదీన తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించారు.  మద్య తగరతి కుటుంబంలో జన్మించిన ఆమె నిర్మలా సీతారామన్ తమిళనాడులోని తిరుచిరపల్లిలో ఉన్న సీతాలక్ష్మీ రామస్వామి కాలేజ్‌లో ఆర్థికశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు.న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ నుంచి ఎంఫిల్ పట్టా పొందారు. 2008లో నిర్మ‌లా బీజేపీలో చేరారు. పార్టీ ప్ర‌తినిధిగా ఆమె బాధ్య‌త‌లు చేప‌ట్టారు. 2014లో జూనియ‌ర్ మంత్రిగా మోదీ క్యాబినెట్‌లోకి ఆమె చేరారు. ఏపీ నుంచి రాజ్య‌స‌భ‌కు ఆమె ఎంపిక‌య్యారు.  

Related posts