telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు విద్యా వార్తలు

13(వెయిటర్) ప్రభుత్వ ఉద్యోగాలకు…ఉన్నత విద్య చదివిన 17 వేలమంది దరఖాస్తు…

highly qualified applied for waiter jobs

దేశంలో నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందొ తెలిసిందే. అయితే అప్పుడప్పుడు ఇది బహిరంగ వేలం.. మాదిరి ప్రచారం కూడా అవుతుంది. అలాంటిదే తాజాగా, మహారాష్ట్ర సచివాలయంలోని క్యాంటీన్ లో 13 వెయిటర్ ఉద్యోగాలకు డిగ్రీలు చేసిన వారు సహా 7 వేల మంది పోటీ పడుతున్నారు. ఈ ఉద్యోగానికి 4వ తరగతి ఉత్తీర్ణత మాత్రమే విద్యార్హత. వెయిటర్ ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఏర్పడటంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత నవాబ్ మాలిక్ స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం సరైన ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.

ఇంకా, యువకులు ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పిన ఆయన, రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావడం లేదన్నారు. నిర్మాణరంగంలో ఏ విధమైన ఉపాధీ లభించడం లేదని, నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్సీపీ ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. ఏవైనా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే, ఎవరైనా దరఖాస్తు చేసుకుంటారని ఆర్థికమంత్రి సుధీర్ ముంగంతివార్ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం ఎన్నో ఉద్యోగాలను కల్పించిందని అన్నారు. ఇక మహారాష్ట్ర గణాంకాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని నిరుద్యోగుల సంఖ్య ఏడాది వ్యవధిలో 33.56 లక్షల నుంచి 42.2 లక్షలకు చేరింది. ఇదే సమయంలో కొత్త ఉద్యోగాల కల్పన 17 వేలకు పడిపోవడం గమనార్హం.

Related posts