ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసిందో లేదో… ఏపీ సీఎం జగన్ కూడా హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు… ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఢిల్లీ పర్యటనకు బయల్దేరనున్న ఆయన.. సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీకానున్నారు ఏపీ సీఎం.. వరదలతో నష్టపోయిన ఏపీకి పరిహారం చెల్లించాల్సిందిగా రెండు రోజుల క్రితమే కేంద్రానికి లేఖరాసిన సీఎం జగన్.. ఈ నేపథ్యంలోనే అమిత్‌షాను కలవబోతున్నారు. రాష్ట్రవిభజకు సంబంధించిన పెండింగ్ అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన సమస్యల పరిష్కారంపై కూడా చర్చించే అవకాశం ఉందంటున్నారు. కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన ముగిసే వెంటనే.. ఏపీ సీఎం ఢిల్లీకి వెళ్తుండడం ఆసక్తికరంగా మారింది. అమిత్ షాతో భేటీ తరువాత జగన్ అనేక మంది కేంద్ర మంత్రులు, ప్రధానిని కలిసే అవకాశం ఉన్నది. మరి చూడాలి ఈ పర్యటనలో జగన్ తెర పైకి తెచ్చే విషయాలు ఏంటి అనేది.
previous post
కమ్మ సామాజిక వర్గంపై ఏపీ సీఎం కక్ష్య: సుంకర ఆరోపణ