telugu navyamedia
వార్తలు సామాజిక

ఓలా ఉద్యోగులపై వేటు…1,400 మందికి ఉద్వాసన!

ola

కరోనావైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ విధించడంతో పలు సంస్థలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పలు సంస్థలు సిబ్బందిని కుదిస్తున్నాయి. ఇప్పటికే ఉబెర్‌ కూడా ఉ‍ద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఓలా సంస్థ కూడా ఉద్యోగులను తొలగింపునకు నిర్ణయించింది. గత రెండు నెలల్లో ఆదాయం 95 శాతం క్షీణించడంతో ఓలా రైడ్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫుడ్ బిజినెస్ నుండి 1,400 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌లో ఓలా సీఈఓ భవష్ అగర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ సంక్షోభం కారణంగా భారతదేశం అంతటా మిలియన్ల మంది తమ డ్రైవర్లు , వారి కుటుంబాల జీవనోపాధిని ప్రభావితం చేసిందని సీఈవో చెప్పారు. అసాధారణమైన, అనిశ్చితమైన ఈ పరిస్థితుల ప్రభావం తమపై దీర్ఘకాలంగా ఉండనుందని ఆయన ప్రకటించారు.

Related posts