telugu navyamedia
ఆంధ్ర వార్తలు

విజ‌య‌వాడ క‌న‌క దుర్గమ్మను దర్శించిన గవర్నర్‌ దంపతులు

ఇంద్రాకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇంద్రకీలాద్రిపై స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సప్రవ హరి చందన్ దంపతులు గురువారం దర్శించుకున్నారు. స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా కనకదుర్గమ్మ దర్శనమిస్తున్నారు. అలంకారం అనంతరం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు తొలి పూజలో పాల్గొన్నారు.

గవర్నర్‌ దంపతులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆలయ పాలక మండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ స్వాగతం పలికారు.

Sri Durga Malleswara Swamy varla Devasthanam

దర్శనం అనంతరం.. గవర్నర్‌ మీడియాతో మాట్లాడుతూ, దసరా మొదటి రోజున దుర్గమ్మను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.తెలుగు ప్రజలకు అమ్మవారి కృప, కరుణా కటాక్షాలు లభించాలని గవర్నర్ ఆకాంక్షించారు. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని, కరోనాను ప్రపంచం నుంచి దూరం చేయాలని అమ్మవారిని కోరుకున్నానని గవర్నర్‌ తెలిపారు.

Related posts