telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్‌ రైతాంగానికి సమాధానం చెప్పాలి.. దేవినేని ఉమ డిమాండ్

uma devineni

హైదరాబాద్ ప్రగతిభవన్ లో తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమ ఘాటుగా స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో పనుల పురోగతిపై సమావేశంలో ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. నాలుగేళ్లలో పట్టిసీమ ద్వారా 44 వేల కోట్ల పంట పండిందని దేవినేని ఉమ పేర్కొన్నారు.

ఉత్తరాంధ్ర మీకేం అన్యాయం చేసిందని దేవినేని ఉమ నిలదీశారు. బహుదా-వంశధార నదుల అనుసంధానం పనులు ఆపేశారన్నారు. సమావేశంలో తోటపల్లి ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడలేకపోయారని నిలదీశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను ఎందుకు ఆపేశారని నిలదీశారు. ఆంధ్ర రైతాంగానికి జగన్ సమాధానం చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు.

Related posts