telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉంది: సజ్జల

రాష్ట్రంలో విద్యుత్‌ సమస్య తీవ్రంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. గృహ వినియోగదారులు సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు విద్యుత్‌ వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించారు. లేకపోతే వచ్చే వేసవికి పరిస్థితి ఘోరంగా ఉంటుందని, రాబోయే రోజుల్లో అధికారికంగా విద్యుత్ కోత‌లు విధించాల్సి రావొచ్చ‌ని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైతే అధికారిక విద్యుత్‌ కోతలు లేనప్పటికీ పరిస్థితి ఇలాగే కొనసాగితే కోతలు విధించాల్సి వస్తుందని అన్నారు.

విద్యుత్‌ సంక్షోభంపై సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ‘దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ విద్యుత్‌ పైనే చర్చ ఉంది. అంతర్జాతీయంగా కూడా ఎప్పుడూ లేనంతగా విద్యుత్‌ డిమాండ్‌ పెరిగింది. ఇదే సమయంలో బొగ్గు దొరకడం లేదు. పరిస్థితిని ప్రధానికి తెలిపేందుకే సీఎం జగన్‌ లేఖ రాశారు అన్నారు. బొగ్గు నిల్వలు కేంద్ర పరిధిలోనివి. రాష్ట్రాలు స్వయంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉండదని బొగ్గు సరఫరా విషయంలో రాష్ట్రాలపై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని సజ్జల అన్నారు.

Related posts