telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ ఎక్సైజ్ శాఖ స్టాఫ్ పాటర్నులో మార్పులు…

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ శాఖ లోని స్టాఫ్ పాటర్నులో మార్పులు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏయే జోన్లల్లో ఏయే జిల్లాలు వస్తాయి అనే అంశాలను వివరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ స్టాఫ్ పర్యటనలో మార్పులు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖకు సంబంధించిన 70 మంది శాతం ఉద్యోగులను ఎస్ఈబీకి కేటాయించడంతో ఎక్సైజ్ శాఖలో మార్పులు చేసినట్లు సమాచారం. ఎక్సైజ్ శాఖలోని అధికారులు.. ఉద్యోగుల పరిధిని నిర్దారించారు. జోన్లు, విభాగాల వారీగా ఉద్యోగుల కేటాయింపు.ఏయే జోన్లల్లో ఏయే జిల్లాలు వస్తాయనేది చూస్తే

వైజాగ్ కేంద్రంగా జోన్-1 పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలు.

కాకినాడ కేంద్రంగా జోన్-2 పరిధిలో తూర్పు, పశ్ఛిమ గోదావరి, కృష్ణా జిల్లాలు.

గుంటూరు కేంద్రంగా జోన్-3లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు.

కర్నూలు కేంద్రంగా జోన్-4లో కర్నూలు  చిత్తూరు, కడప, అనంత జిల్లాలు ఉన్నాయి.

Related posts