telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

గుడ్ న్యూస్ : 3 రోజులగా స్థిరంగా బంగారం ధరలు.. ఇవాళ ఎంతంటే

బంగారం ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. బంగారానికి ఉన్న డిమాండ్‌ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. కానీ మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కరోనా టైంలో బంగారం ధరలు ఆమాంతం పెరిగాయి. అయితే… బులియన్‌ మార్కెట్‌లో మూడు రోజులుగా పెరిగిన బంగారం ధరలు తాజాగా స్థిరంగా నమోదయ్యాయి. హైదరాబాద్ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,750 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,600 పలుకుతోంది. బంగారంతో పాటు.. వెండి ధరలు నిలకడగా నమోదయ్యాయి. కిలో వెండి ధర రూ.75,700 వద్ద కొనసాగుతోంది.

Related posts