telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మా బాస్ ని ఎలా సాటిస్ఫై చేస్తారు ?… బిగ్ బాస్ పై కమిట్మెంట్ ఆరోపణలు

Swetha

ప్రముఖ టీవీ ఛానెల్ స్టార్ మా యాజమాన్యం నిర్వహిస్తున్న రియాలిటీ షో “బిగ్ బాస్” సీజన్-3 త్వరలోనే మొదలుకానుంది. కింగ్ నాగార్జున ఈ షోని హోస్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం షోలో పాల్గొనబోయే కంటెస్టంట్ ల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్లు వీరేనంటూ పలువురి పేర్లు బయటకు వచ్చినా అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. ఈ షో మొదలుకాకముందే ఓ వివాదం హాట్ టాపిక్ గా మారింది. యూట్యూబ్ లో తన ఇంటర్వ్యూలతో కాస్త క్రేజ్ తెచ్చుకున్న యాంకర్ శ్వేతారెడ్డిని ఈ షో కోసం సంప్రదించారట.

ఆమెతో అగ్రిమెంట్ మీద సైన్ చేయించుకున్న తరువాత నిర్వాహకులు అడిగిన ప్రశ్నలకు షాక్ అయినట్లు తెలిపింది. అంత పెద్ద సంస్థ తనను చీట్ చేసిందని చెప్పింది. షోలో పార్టిసిపేట్ చేయడం మీకు ఇంటరెస్ట్ ఉందా..? అంటూ తనకు ఓ కోఆర్డినేటర్ నుండి ఫోన్ వచ్చిందని.. తాను ఓకే చెప్పి అగ్రిమెంట్ మీద సైన్ చేసిన తరువాత మరో కోఆర్డినేటర్ గేమ్ వివరాలను చెబుతానని పిలిచి మిమ్మల్ని ఎందుకు ఎంచుకోవాలని ప్రశ్నించారని, వాళ్లే తనను సంప్రదించి మళ్లీ ఇలాంటి ప్రశ్నలు వేయడమేంటో తనకు అర్ధం కాలేదని తెలిపింది. “మీరు షోలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారు…?” అంటూ షో కోఆర్డినేటర్ అడిగారని, గేమ్ మొదలు కాకముందే ఇలా ఎందుకు ప్రశ్నిస్తున్నారని అడిగితే సదరు వ్యక్తి.. ”మీరు మా బాస్ ని ఎలా సాటిస్ఫై చేస్తారు” అని అడిగాడని, “కమిట్మెంట్ అడుగుతున్నారా…?” అని సీరియస్ అయ్యేసరికి తనను అవాయిడ్ చేశారని సంచలన ఆరోపణలు చేసింది. మరి శ్వేతారెడ్డి వ్యాఖ్యలపై బిగ్ బాస్ యాజమాన్యం ఎలా స్పందిస్తారో చూడాలి.

Related posts