telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

సెకన్ వ్యవధిలో 2 నెలల బాబు ప్రాణాలు కాపాడిన వ్యక్తి… వీడియో వైరల్

baby

అమెరికాలో ఓ పాన్ షాప్(వస్తువుల తాకట్టు దుకాణం) మేనేజర్ పసిబిడ్డకు ప్రాణాలు పోశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. అమెరికాలోని యూటా రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పైనున్న వీడియోను గమనిస్తే.. పాన్ షాప్‌‌కు వచ్చిన ఇద్దరు మహిళలు అక్కడున్న వస్తువులను చూస్తూ తమ పనిలో తామున్నారు. షాపులో పనిచేసే మహిళ కూడా ఇద్దరు మహిళల ప్రశ్నలకు జవాబిస్తూ ఆమె పనిలో నిమగ్నమైంది. పసిబిడ్డను కౌంటర్‌పై కూర్చోపెట్టి ఇద్దరు మహిళలు వస్తువులను చూస్తూ బిజీ అయిపోయారు. ఇదే సమయంలో కౌంటర్‌పై బ్యాలెన్స్ తప్పిన పిల్లోడు ఒక్కసారిగా కిందకు పడిపోయాడు. సరిగ్గా పిల్లోడి తల నేలకు తగిలే సమయంలో.. సెకన్ల వ్యవధిలో షాప్ మేనేజర్ వచ్చి బాబును పట్టుకున్నాడు. దీంతో మహిళలిద్దరూ ఊపిరిపీల్చుకున్నారు. తాను సమయానికి రాకుంటే.. పిల్లోడి తల నేలకు తగిలి ఉండేదని.. నెలలు వయసు కావడంతో ఆ దెబ్బకు ప్రాణాలు పోయినా ఆశ్చర్యపోనవసరం లేదని షాప్ మేనేజర్ చెబుతున్నారు. మరోపక్క ఈ వీడియో చూసిన నెటిజన్లు షాప్ మేనేజర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Video Source: KGET News

Related posts