telugu navyamedia
సినిమా వార్తలు

హైపర్ ఆదిపై అనసూయ ఫైర్

Anasuya-and-Hyper-Aadi

“జబర్ధస్త్” కామెడీ షో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో తెలిసిన విషయమే. ఈ షోలో పాల్గొన్న చాలామంది తమ టాలెంట్ ను నిరూపించుకుని సినిమాలలో కూడా ఛాన్సులు కొట్టేస్తున్నారు. ఇక కమెడియన్ హైపర్ ఆది కూడా “జబర్దస్త్”తోనే స్టార్ కమెడియన్ స్టేటస్ అందుకున్నాడు. జబర్ధస్త్ షోలో హైపర్ ఆది కామెడీ కోసమే చూసేవాళ్లన్నారంటే అతిశయోక్తి కాదు. “జబర్దస్త్”లో తన పంచ్ లు బాగా పేలడంతో సినిమాల్లో అడుగుపెట్టాడు. కానీ అక్కడ హైపర్ ఆది పంచ్‌లు మాత్రం పేలలేదు. అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పి ..తనకు అచ్చొచ్చిన “జబర్ధస్త్” షోనే నమ్ముకున్నాడు. అయితే గత ఎన్నో ఎసిపోడ్స్‌లో హైపర్ ఆది..తన స్కిట్స్‌లో ఏదో ఒక సమయంలో అనసూయను కవ్విస్తూ కామెడీ చేస్తుంటాడు. ఇక అనసూయ కూడా హైపర్ ఆది చేసే ఇలాంటి స్కిట్స్‌ను ఎంజాయ్ చేస్తూ ఉండేది. ఇక షో జడ్జెస్ నాగబాబు, రోజా కూడా హైపర్ ఆది చేసే స్కిట్స్‌ను పడి పడి నవ్వేవారు. కానీ గత కొన్ని ఎపిసోడ్స్‌లో హైపర్ ఆది చేసే స్కిట్స్‌లో అనసూయ పై చేసే కామెడీ తారా స్థాయికి చేరింది. దీంతో జబర్దస్త్ షో తర్వాత హైపర్ ఆదికి అనసూయ కాస్తంత గట్టిగానే క్లాస్ పీకినట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు రోజా, నాగబాబు కూడా హైపర్ ఆది చేసే స్కిట్స్ విషయంలో సీరియస్ అయినట్టు సమాచారం.

Related posts