ఆంధ్రప్రదేశ్ కు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని తలపెట్టిన ఉద్యమాన్ని నీరుగార్చేందుకు పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. నెల్లూరుజిల్లాలో సాగుతున్న రైతుల మహాపాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. రోజుకో కారణంతో పాదయాత్రలో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారు.
న్యాయస్థానం టు దేవస్థానంపేరుతో అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు, మహిళలు, రైతులు కలసి మహాపాదయాత్ర సాగిస్తున్నారు. పాదయాత్రలో సర్వమత సామరస్యానికి ప్రతీకగా శ్రీవెంకటేశ్వరస్వామి, జీసస్, అల్లా ప్రచార రథాలను వెంట తీసుకొస్తున్నారు.
పాదయాత్ర జీసస్, అల్లా ప్రచార రథాలను అనుమతించేది లేదని పోలీసులు అడ్డుకోవడంతో పాదయాత్ర చేస్తున్నవారు రోడ్డుకు అడ్డంగా బైఠాయించి నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు.