telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కలకాలం.. రంగంలోకి మంత్రి ఆళ్ల నాని

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కలకాలంపై మంత్రి ఆళ్ల నాని స్పందించారు. కరోనా సోకిన వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని DMHO డాక్టర్ గౌరిశ్వరరావును అదేశించారు మంత్రి ఆళ్ల నాని. పరిసర ప్రాంతంలో సూపర్ శానిటేషన్ చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పెరుగుతున్న కరోనా కేసుల నివారణకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైందని…కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.. ఎవరు ఆందోళన చెందొద్దని తెలిపారు.

అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, రామచంద్రపురం ప్రాంతంలో 41 కరోనా కేసులు నమోదు అయ్యాయని… కరోనా పాజిటివ్ రిపోర్ట్ అయిన వారికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని పేర్కొన్నారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతంలో 50మీటర్లు దూరంలో కంటోన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశామని… కరోనా సోకిన వారిని హోమ్ క్వారంటైన్‌లో ఉంచి వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉంచామన్నారు. కరోనా లక్షణాలు ఉన్న ఇద్దరిని కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశామని… ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులో ఉన్న వారందరికీ కరోనా పరీక్షలు చేయించామని వెల్లడించారు.

Related posts