telugu navyamedia
సినిమా వార్తలు

మంటల్లో కాలిపోతూ స్టార్ హీరో ఎంట్రీ

akshay-kumar

సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో భారీ స్టంట్స్ అనేవి చూస్తూనే ఉంటాము. అయితే అప్పుడప్పుడు రిస్కీ షాట్స్ ఉంటే మాత్రం హీరోలు డూప్స్ ద్వారానే స్టంట్స్ చేస్తుంటారు. కానీ కొంతమంది హీరోలు మాత్రం రిస్కీ షాట్స్ లో కూడా డూప్ లేకుండా నటిస్తుంటారు. ఇప్పుడు బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ కూడా ఇలాంటి ఓ రిస్కీ స్టంట్ ను రియల్ గా చేసి అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. తన తాజా వెబ్ సిరీస్ “ది ఎండ్” ప్రమోషన్స్ లో భాగంగా తన షూట్ కు నిప్పంటించుకుని మంటల్లో కాలిపోతూ ఎంట్రీ ఇచ్చారు అక్షయ్. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారితో కలిసి ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు అక్షయ్ కుమార్. ఈ వీడియోను సోషల్ మీడియాలో ఇది ఆరంభం మాత్రమే అంటూ అక్షయ్ షేర్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు అక్షయ్ కుమార్.

Related posts