telugu navyamedia
ఆరోగ్యం

తెల్లజుట్టు, జుట్టురాలే సమస్యకు .. చక్కటి పరిష్కారం ఇదే.. !

Guava Leaves For Healthy Strong Hair
ఒత్తిడితో కూడిన నేటి కాలం జీవనవిధానంలో అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించడం సబబు కాకపోవచ్చు.. కానీ ప్రయత్నించడంతో తప్పేమీలేదు. ఒకపక్క శారీరిక ఆరోగ్యం, మరోపక్క మానసిక ఆరోగ్యం, ఇక బాహ్య సౌందర్యం గురించి చెప్పాల్సిన పనేలేదు. ఇవన్నీ ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ, తమని తాము నిరూపించుకుంటూ ముందుకుపోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అన్ని వేళల ఇది సాధ్యం కాకపోయినా, మన జీవనశైలిని బట్టి ప్రతిదీ ప్రణాళిక వేసుకొని ముందుకుపోవాల్సి ఉంటుంది. ఇక ఒత్తిడి జీవితాలలో జుట్టు రాలె సమస్య సర్వసాధారణం అయినప్పటికీ పొడవాటి జుట్టు ఉండాలనేది కూడా చాలా మంది కోరిక. అందుకు ఏవేవో చేసి ఉంటారు కానీ, ఈ చిన్న ప్రయత్నం కూడా చేసి చూడండి. 
*  జుట్టు రాలే సమస్యతో బాధ పడుతున్న వారికి జామ ఆకులు చేసే మేలు అంతా ఇంతా కాదు. బి విటమిన్డే సహా పలు ఔషధ విలువలు ఉన్న జమ ఆకు జుట్టు కుదుళ్లను బలంగా చేసి జుట్టు రాలే సమస్యను అరికడతాయి. 
*  గుప్పెడు జామ ఆకులను తీసుకొని బాగా మరిగించాలి. ఆ ద్రావకం చల్లారాక.. జామ ఆకుల రసాన్ని కుదుళ్లకు మృదువుగా పట్టించాలి. తరచుగా ఇలా చేస్తుంటే జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలడాన్ని అరికడుతుంది. తెల్ల జుట్టును అందమైన నల్లటి కురులుగా మారుస్తుంది. 
*  ఈ ఆకులలో ఉండే విటమిన్ సి, బి3, బి5, బి6 చర్మాన్ని మెరుగుపరుస్తాయి. పండ్లలో ఉండే లైకోపీన్, విటమిన్ ఏ, పీచు పదార్థం జీర్ణ వ్యవస్థ పనిచేసే తీరును క్రమబద్దం చేస్తుంది. జుట్టు నెరవడాన్ని ఇది నిరోధిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

Related posts