telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షూటింగ్ కు సిద్ధమవుతున్న అఖిల్

MEB

యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా మూడు సినిమాలు చేసినప్పటికీ సరైన హిట్ అందుకోలేదు. కాగా ప్రస్తుతం అఖిల్ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ చేస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై అఖిల్ చాలా ఆశలే పెట్టుకున్నారు. 2021లో సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనేది, నిర్మాతల ఆలోచనగా తెలుస్తుంది. నిజానికి ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన సినిమా.. కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయి వాయిదా పడింది. అయితే ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలు పెడదామని ఆలోచన చేస్తున్నారట చిత్రబృందం. పరిస్థితి బట్టి సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుండి చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట. ఇక షూటింగ్ మొదలు పెడితే ముందుగా సాంగ్ షూట్ ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్. పూర్తి ఫన్ తో ఎమోషన్స్ తో ఈ సినిమాని రూపొందించారని చెప్తున్నారు. అఖిల్ ఈ సినిమాలో మధ్య తరగతి యువకుడిగా కనిపించనున్నారు. అయితే అఖిల్-పూజాల కెమిస్ట్రీ ఈ సినిమాలో ఓ రేంజిలో ఉండబోతుందని టాక్ .

Related posts