telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మళ్ళీ కశ్మీర్ విషయం .. ఎత్తుతున్న ట్రంప్… సాయం చేస్తానంటూ..

trump intermediate on india and pakistan

ట్రంప్ మరోసారి కశ్మీర్ వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్, భారత్ మధ్య జరుగుతున్న వివాదాలను పరిశీలిస్తున్నామని ట్రంప్ చెప్పారు. అవసరమైతే.. కశ్మీర్ వివాదం విషయంలో పాకిస్తాన్, భారత్ కు సాయం చేస్తామని ట్రంప్ చెప్పారు. అయితే సాయం ఏ రూపంలో చేస్తామనేది మాత్రం ట్రంప్ చెప్పలేదు. దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం లో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో ట్రంప్ భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. అమెరికా-పాకిస్తాన్ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు.

అదే సమయంలో కశ్మీర్ వివాదం గురించి ట్రంప్ ప్రస్తావించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, సాయం చేసేందుకు రెడీ అని ట్రంప్ అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సాయం చేస్తామని ట్రంప్ చెప్పడం పట్ల భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కశ్మీర్ అంశం భారత్ అంతర్గత వ్యవహారం అని పదే పదే చెప్పింది. మూడో దేశం జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పింది. అమెరికా సహా ఏ దేశం కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పలు మార్లు స్పష్టం చేసింది. అయినా.. ట్రంప్.. పెద్దన్న పాత్ర పోషించేందుకు రెడీ అనడం చర్చకు దారితీసింది.

Related posts