telugu navyamedia
రాజకీయ సినిమా వార్తలు

మహానాయకుడు  విడుదల..  బాలయ్య విలవిల 

Mahanayakudu
ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ టు”మహానాయకుడు” సినిమా ఈరోజు విడుదల కావాలి . “కథానాయకుడు” చిత్రం  ఘోర  పరాజయం తరువాత “మహానాయకుడు” ఈ నెల  7 నుంచి 14 , ఆ తరువాత 23 కు మారిపోయింది , తేదీ జరిగిపోతూ వుంది . 23 వ తేదీ అయినా విడుదల అవుతుందా అంటే గ్యారంటీ చెప్పలేం అంటున్నారు . బాలకృష్ణ లాంటి  అగ్ర నటుడు , క్రిష్ లాటి సూపర్ డైరెక్టర్ సినిమాకు ఇలాంటి స్థితి రావడం ఎవరు వూహించలేనిది . 
తన తండ్రి జీవిత కథను రెండు భాగాలుగా నిర్మించి విడుదల చెయ్యాలనుకున్నాడు బాలయ్య . మొదట ఈ సినిమా తేజ డైరెక్షన్ లో ముహూర్తం చేసుకుంది . భారత ఉప రాష్ట్రపతి ఈ ముహూర్తానికి ప్రత్యేకంగా వచ్చాడు . హైదరాబాద్ రామకృష్ణ స్టూడియోస్ లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది . బాలకృష్ణ , తేజ మధ్యలో ఏమి జరిగిందో తెలియదు . తేజ డైరెక్షన్ చెయ్యనని ప్రకటించి బయటకు వచ్చాడు .
ఆ తరువాత ఈ సినిమా డైరెక్షన్ గురించి పలువురు పేర్లు బయటకు వచ్చాయి . అప్పుడు క్రిష్ పేరు తెర మీదకు వచ్చింది . నిజానికి క్రిష్ అప్ప్పుడు కంగనా రనౌత్ తో ఝాన్సీ భాయ్ జీవిత చరిత్ర ను “మణికర్ణిక ” పేరుతో నిర్మిస్తున్నారు . ఆ చిత్రం షూటింగ్ పూర్తి కాకుండానే  బాలయ్య పిలిచాడని క్రిష్ ముంబై నుంచి ఆ ప్రాజెక్ట్ ను వదిలేసి వచ్చాడు . తేజ తాను డైరెక్ట్ చేద్దామనుకున్న స్క్రిప్టును పూర్తిగా పక్కన పెట్టి మళ్ళీ క్రిష్ బాలయ్య సూచనల మేర కొత్త స్క్రిప్ట్ తయారు చేయించారు . ఆ స్క్రిప్టును ఎవరు కాపీ కొట్టకూడదనే ఉద్దేశ్యంతో  క్రిష్ దానిని తెలుగు రచయితల సంఘం లో రిజిస్టర్ చేయించారు . 
హేమాహేమీలతో సినిమా మొదలు పెట్టారు , షూటింగ్ కొంత అయినా తరువాత ఈ సినిమా కోసం బయ్యర్లు ఎగబడ్డారు . ఈ సినిమా ను రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు . మొదట ఈ సినిమా సాయి కొర్రపాటి , విష్ణు నిర్మాతలు . అయితే డబ్బు కూడా వారే పెట్టారు . అయితే ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి బాలకృష్ణ తానే నిర్మాతగా మారి సాయి , విష్ణు ను సమర్పకులుగా మార్చేశాడు . సినిమాను థియేటర్ లు , శాటిలైట్ , డిజిటల్ , ఓవర్సీస్ అన్నీ కలిపి 120 కోట్ల వరకు వచ్చిందని సినిమా పెద్దల అంచనా . సాయి , విష్ణు కు వారు పెట్టిన డబ్బు తో పాటు కొంత లాభాలు ఇచ్చి మిగతా డబ్బంతా బాలయ్య తీసుకున్నాడని అంటారు .
ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు బాలయ్య నిర్మాత కాబట్టి లాభాలు సహజంగానే బాలకృష్ణ కు వెళతాయి. అయితే బాలయ్య నిర్మాత  కావడం అతన్ని ఇప్పుడు ఇబ్బందుల్లోకి నెట్టిందని అంటున్నారు . మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న విడుదల చేశారు . సంక్రాంతి సీజన్ కావడంతో కలెక్టన్ల బాగా వస్తాయని  ఆశ పడ్డారు . కాని బాలయ్య, క్రిష్ అంచనా తలక్రిందులయ్యింది . థియేటర్ లలో  20 కోట్లు కూడా రాలేదు . కథానాయకుతో ఆర్ధికంగా నష్టపోయిన కొనుగోలు దారుల ఇప్పుడు మహాయకుడు ఉచితంగా ఇస్తామని అన్నా ముందుకు రావడం లేదని అంటున్నారు . 
కొత్త బయ్యర్లు కూడా ఎవరు మహానాయకుడు తీసుకోవడానికి ముందుకు రావడం లేదని తెలిసింది . అందుకే ఏమి చెయ్యాలో “ఎన్టీఆర్  మాయానాయకుడు ” సినిమాను ఎలా విడుదల చెయ్యాలో తెలియక బయ్యర్ల ను బ్రతిమాలాడుతున్నట్టు చెప్పుకుంటున్నారు . ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలో కాంగ్రెస్ ను తిట్టకపోవడం , చంద్ర బాబుని విలన్ గా చూపించక పోవడం , లక్ష్మి పార్వతి పాత్ర ఉండదని చెప్పడంతో ఇంకా చూడటానికి ఆ సినిమాలో ఇంకేం ఉంటుందని బయ్యర్ల అనుమానం . 
రేపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ “యాత్ర ” విడుదల అవుతుంది . వచ్చే నెల వర్మ “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” విడుదల అవుతుంది . ఇలాటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు విడుదల చేసుకోవడంలో జాప్యం జరిగితే అది బాలయ్య తన పరువు , మర్యాదలను తానె మంట కలుపుకోవడమే . అందుకే “మహానాయకుడు” సినిమా ను బయ్యర్లకు ఉచితంగా ఇస్తారనే వార్త ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ లోహల్ చల్ చేస్తుంది . 
మహానటుడు , నాయకుడు ఎన్టీ రామారావు జీవిత కథ తో తీసిన బయోపిక్ ఫ్లాప్ కావడం ఆయన ఆత్మ  క్షోభించడమే !

Related posts