telugu navyamedia
సినిమా వార్తలు

జబర్దస్త్ కు ముందు నరకం చూసిన రష్మీ…

rashmi goutam movie sivaranjani trailer

ఒకప్పుడు అవకాశాలకోసం ఆఫీసులచుట్టూ చెప్పులరిగేలా తిరిగిన రష్మి గౌతమ్. పది ఏళ్ల పాటు నరకం చూసింది. దాసరి లాంటి దర్శకుడి సినిమాలో నటించిన తర్వాత కూడా రష్మిని తెలుగు దర్శక నిర్మాతలు పట్టించుకోలేదు. హోలీ, కరెంట్ లాంటి సినిమాల్లో నటించినా రష్మికి పెద్దగా గుర్తింపు రాలేదు. అలాంటి సమయంలో ఆమెకు అనుకోకుండా జబర్దస్త్ కామెడీ షోలో హోస్టింగ్ చేసే అవకాశం వచ్చింది. అనసూయ గర్భం దాల్చడంతో కొన్ని వారాల పాటు ఆమె తప్పుకోవడంతో రష్మి గౌతమ్‌కు కలిసొచ్చింది. దాంతో అలా ఆమెకు జబర్దస్త్ ఆఫర్ వచ్చింది. అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు తెలియని రష్మి గౌతమ్ జబర్దస్త్ కామెడీ షోలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందరికీ పరిచయం అయిపోయింది. ఆ తర్వాత అనసూయ రీ ఎంట్రీ ఇచ్చినా కూడా అప్పటికే పాతుకుపోయింది. సుడిగాలి సుధీర్‌తో ఈమె కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది. హీరోయిన్ స్నేహితురాలి పాత్రల్లో నటించిన రష్మి గౌతమ్ జబర్దస్త్ తర్వాత హీరోయిన్‌గా ప్రమోషన్ అందుకుంది. అప్పట్నుంచి డబ్బులకే తన ప్రాముఖ్యత అని చెప్పింది రష్మి.

Related posts