telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కేవలం పనికొచ్చే విషయాలను మాత్రమే వింటున్నా : చరణ్

RC

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. పవన్ విషయాల్లో వర్మ ఎప్పుడూ ఏదో ఒకటి కెలుకుతూ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంటాడు. అందుకే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు వర్మ అంటే మొదట్నుంచి వ్యతిరేకమే. ఇక ఎప్పుడైతే వర్మ ‘పవర్ స్టార్ ‘ సినిమా నిర్మాణం మొదలు పెట్టాడో అప్పట్నుంచి ఫ్యాన్స్ కి వర్మకి మధ్య వివాదం మరింత ముదిరింది. వర్మ పవన్ అభిమానులను రెచ్చగొడుతూ దమ్ముంటే నేరుగా వచ్చి తేల్చుకోవాలని సవాల్ విసరడంతో.. అభిమానులు వర్మ కార్యాలయంపై దాడి చేశారు. దీనిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన వర్మ ఆ తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నారు. వర్మ తీరుపై అల్లు అరవింద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హీరో నిఖిల్ కూడా వర్మను కుక్కతో పోల్చుతూ కౌంటర్ ఇచ్చాడు. ఈ వివాదంపై కొణెదల కుటుంబం నుంచి తొలి సారి రిప్లై వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్లో రంగస్థలంలోని చిట్టి బాబు లుక్ ని పోస్ట్ చేసి ‘కేవలం పనికొచ్చే విషయాలను మాత్రమే వింటున్నాను’ అని కామెంట్ పెట్టాడు. చరణ్ వర్మను దృష్టిలో ఉంచుకునే ఈ వ్యాఖ్యలు చేసారని నెటిజన్లు భావిస్తున్నారు. వర్మ ఎప్పుడైతే టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి చిరంజీవి కుటుంబంపై వివాదాలను సృష్టిస్తూనే ఉన్నాడు. వర్మ పైకేమో నాకు పవన్ అంటే ఇష్టం, దేవుడంటూ, ఇకపై పవన్ పేరు కూడా ఎత్తనంటూ ఆయన్ను బేస్ చేసుని వివాదాలను రగిలిస్తూనే ఉన్నాడు. పవన్ పై విమర్శలు చేసే కత్తి మహేష్, శ్రీరెడ్డి వంటి వారికి వర్మ మద్దతు ఇచ్చాడు. ఇవన్నీ మెగా ఫ్యాన్స్ కు వర్మ పట్ల తీవ్ర వ్యతిరేకతను పెంచుతున్నాయి. కొందరు పని గట్టుకుని నాపై వివాదాలు సృష్టిస్తున్నారంటూ ఏకంగా పవనే ఫిల్మ్ ఛాంబర్ లో ధర్నాకు దిగారు. ఆ సమయంలో అల్లు అర్జున్ సహా మెగా ఫ్యామిలీ అంతా ఆయన వెనుకే నిలబడ్డారు. వర్మపై చర్యలకు అప్పుడే డిమాండ్లు వినపడ్డా…ఆ తరువాత ఎవరూ దాని గురించి పట్టించుకోలేదు.

Related posts