telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“అసురన్” తెలుగు రీమేక్ లో హీరోయిన్ ఆమె…!

Venkatesh

తమిళంలో ధనుష్, మంజు వారియర్, వెట్రిమారన్ కాంబినేషన్‌లో విజయవంతమైన ‘అసురన్’ చిత్రాన్ని తెలుగులో వెంకటేశ్ హీరోగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డి.సురేష్ బాబు, కలైపులి థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ చిత్రంలో వెంకటేశ్ జోడిగా ప్రియమణి నటించనున్నారట. తమిళంలో మంజూ వారియర్ పోషించిన పాత్రను ప్రియమణి పోషించనున్నారు. కుల వ్యవస్థ కారణంగా జరిగిన గొడవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక గత ఏడాది ఎఫ్-2, వెంకీమామ చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న వెంకటేశ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

Related posts