telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అనుష్కతో పెళ్ళి విషయం తేల్చేస్తానంటున్న ప్రభాస్

prabhas-and-anushka

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. “బాహుబలి” తర్వాత ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంపై ఉన్న అంచనాలు కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్లు వార్తలు వినపడుతున్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమాపై ఓ రేంజ్ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉండడంతో అభిమానులు తొలి రోజే ఈ సినిమాని వీక్షించేందుకు పోటీలు ప‌డుతున్నారు. ప్రభాస్ ‘సాహో’ ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. త్వరలో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రభాస్ జాతీయ మీడియాకు ఇంటర్వ్కూలు ఇస్తున్నాడు. అయితే ఓ ఇంటర్క్యూలో హీరోయిన్ అనుష్క తో ఉన్న రిలేషన్ షిప్ గురించి చెప్పాలని ప్రభాస్ ను ప్రశ్నించారు. దీనిపై ప్రభాస్ సరదాగా స్పందిస్తూ “అనుష్కగానీ నేనుగానీ ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటేనే తప్ప ఈ పుకార్లకు పుల్ స్టాప్ పడేలా లేదు. ఖచ్చితంగా ఈ విషయం గురించి ఓ సారి అనుష్కతో మాట్లాడుతా. నువ్వైనా తొందరగా పెళ్లి చేసుకుంటే ఇలాంటి వార్తలకు బ్రేక్ పడుతుందేమోనని అనుష్కకు చెప్తాను” అన్నాడు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Related posts