telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బీయింగ్ హ్యూమన్” ఛారిటీ వెనుక సల్మాన్ స్వార్థం, మోసాలు… దర్శకుడి సంచలన వ్యాఖ్యలు

salman

సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి రావాలనుకున్న వారిని ఆరంభంలోనే అంతం చేసేందుకు వారు ప్రయత్నాలు చేస్తారంటూ కొందరు బాలీవుడ్ ప్రముఖులపై నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇండస్ట్రీకి సంబంధం లేని వారిని ఎదగకుండా అడ్డుకుంటున్నారు అంటూ కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీ ఇంకా సల్మాన్ వంటి వారిపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ తనపై ఉన్న కేసుల నుండి మీడియా దృష్టిని మరల్చి మంచివాడు అనిపించుకునేందుకు “బీయింగ్ హ్యూమన్” ఛారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అభినవ్ కశ్యప్ అన్నారు. “బీయింగ్ హ్యుమన్” సంస్థ ఏర్పాటు వెనుక సల్మాన్ తండ్రి సలీంఖాన్ స్వార్ధ ప్రయోజనాలు ఉన్నాయి. తన కుమారుడిపై ఉన్న క్రిమినల్ కేసులు, గుండా ఇమేజ్‌ను తొలగించడానికి ఈ సంస్థను స్థాపించారు. ఛారిటీ మాటున చాలా మోసాలు జరుగుతున్నాయి. ఈ సంస్థ ద్వారా కేవలం రూ. 500 ఖరీదు చేసే జీన్స్ ప్యాంట్ ను ఏకంగా రూ.5000 లకు అమ్ముతున్నారు. దబాంగ్ షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ పేదలకు అయిదు సైకిళ్లు పంచి పెట్టారు. వాటిని ఫొటోలు తీసి 500 మందికి సైకిళ్లు ఇచ్చినట్లుగా మీడియాలో ప్రచారం చేసుకున్నారు. కేవలం పబ్లిసిటీ కోసమే “బీయింగ్ హ్యూమన్” కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పబ్లిసిటీతో పాటు ఆర్థికంగా కూడా సల్మాన్ ఖాన్ కు ఆ ఛారిటీ కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయి. అభిమానం అనేదానిని ఉపయోగించుకుని సల్మాన్ ఖాన్ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఎవరు కూడా “బీయింగ్ హ్యూమన్” ద్వారా సాయం పొందవద్దు. ప్రభుత్వం సల్మాన్ ఛారిటీ కార్యక్రమాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలంటూ దర్శకుడు అభినవ్ డిమాండ్ చేశాడు.

Related posts